- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో.. కేశవ మెమోరియల్ కళాశాలలో అయ్యప్ప పూజ
- పెద్ద ఎత్తున తరలివచ్చిన అయ్యప్ప స్వాములు
- హాజరైన విజయక్రాంతి దినపత్రిక ఎండీ విజయరాజం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడ కేశవ మెమోరియల్ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజా కార్యక్రమం నేత్రంపర్వంగా సాగింది. కిషన్‌రెడ్డి దంపతులు వరు సగా 24 ఏళ్లుగా పడిపూజ నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి మాలధారణతో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూజారి ఆత్రేయ సారథ్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి అభిషేకం, మంత్రోచ్ఛరణలతో పూజా ప్రాంగ ణం అయ్యప్ప శరణుహెషతో మార్మోగింది.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతు లతోపాటు ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, డీకే అరుణ, విజయక్రాంతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ చిలప్పగారి విజయరాజం, మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, దణ్పాల్ సూర్యనారాయణ, రాకేశ్‌రెడ్డితోపాటు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు.
ఈ సందర్భంగా గురు స్వాములు మాట్లాడుతూ.. హరిహరసుతుడు అయ్యప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో శాస్త్ర ప్రకారం నిర్వహించే ఈ పూజలు, అర్చనలు హైందవ సంప్రదాయానికి ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. అయ్యప్ప దీక్ష మత సామరస్యానికి ప్రతీక అని, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని పేర్కొన్నారు.