ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే శంకర్ దంపతులు...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): లోక కళ్యాణార్థం నిరహించే 85వ విశ్వశాంతి శ్రీ వైష్ణవ అయుత చండీ అతిరుద్రం మహాయగా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైనది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో శ్రీకృష్ణ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి సరూపానంద సామిజీ నేతృతంలో ఆదివారం నుండి జనవరి 6వ తేదీ వరకు జరుగుతున్న విశ్వశాంతి మహాయగ మహోత్సవంలో భాగంగా తొలిరోజు చతుర్వేద పూరక మహా గణపతి పూజతో పాటు, వివిధ పూజాది కార్యక్రమాలను శాస్త్రక్తంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. విశ్వశాంతి మహా యాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జిల్లా ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఈ అయుత చండీ యాగంలో పదివేల చండీ పారాయణములు, 1,000 హోమ గుండాలు ఉంటాయని సామీజీ పేర్కొన్నారు. పట్టణంలో దేవత మూర్తులతో భారీ సెట్టింగ్ లు ఏర్పాటు చేశారు. పలు దేవత మూర్తులతో కూడిన ఫ్లెక్సీలను విద్యుద్దీకరణలతో అలంకరించారు. పట్టణంలోని పురవీధులన్నీ విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి.