రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి, (విజయక్రాంతి): ఆయుష్మాన్ భారత్ పిఏం జన్ ఆరోగ్య యోజన కార్యక్రమంలో ఆయుర్వేద పితామహుడు ధనవంతరీ జయంతి కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. మంగళవారం ఆయుష్మాన్ భారత్ పి ఏం జన్ ఆరోగ్య యోజన కార్యక్రమమును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెబ్‌నార్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంను సుల్తాన్ పూర్ మెడికల్ డివైస్ పార్క్, సహజనానంద్ మెడికల్ టెక్నాలజీ ప్రయివేట్ సంస్థ ఇంటర్నెట్ వేదికగా వర్చూవల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, పరిశ్రమలు శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టి జి ఐ ఐ సి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, టి జి ఐ ఐ విష్ణువర్ధన్ రెడ్డి, సి ఎం ఓ కార్యాలయ అధికారి అజిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి, సహజానంద్ మెడికల్ టెక్నాలజీ ఏం డి, ఎస్ హెచ్ ధీరజ్ లాల్ కోటడియా, పరిశ్రమల శాఖ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.