సీజన్ మారింది.. వాతావరణలో మార్పుల ప్రభావం ఆరోగ్యపై పడుతుంది. ముఖ్యంగా శీతాకాలం ఆరంభంలో జలుబు, ఫ్లూ సహజం. జలుబు సాధారణంగా మామూలే అయినప్పటికీ రోగనిరోధక వ్యవస్థకు సవాలు విసురుతూ శరీరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎన్ని మందులు వాడినా అప్పటికి తగ్గినట్టే అనిపిస్తుంది.. కానీ అది తాత్కాలికం మాత్రమే.. ఇంగ్లీషు వైద్యంతో విసిగిపోయినవారు అప్పుడప్పుడు ఆయుర్వేదం వైపు చూస్తూ ఉంటారు. అలా ఆస్తమా, జలుబు, దగ్గుల బారిన పడేవారు కింది మూలికా ఔషధాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. అవేంటో చూద్దాం.
1 అశ్వగంధ
దీన్ని ములేతి లేదా లైకోరైస్ అంటారు. ఇది గొంతు నొప్పిని నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇదే కాదు ఈ మూలికతో ఇంకా అనేక ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. అశ్వగంధ యాంటీ వైరల్ ఏజెంట్‌లుగా పనిచేసే రెండు రసాయన భాగాలను కలిగి ఉంది. ములేతికి శరీరం లోపల ఇన్‌ఫెక్షన్లు వ్యాపించకుండా నిరోధించే శక్తి ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
2 తులసి
తులసి శీతాకాలపు ఔషధం. ఇది గొప్ప సుగుణాలు కలిగి ఉంది. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్లమేటరీలు ఉన్నాయి. దీనివల్ల శీతాకాలంలో కనిపించే వ్యాధులకు తులసి చక్కని ఔషధంగా పని చేస్తుంది. ముఖ్యంగా జలుబు నుంచి ఉపశమనం కలిగించడంలో ముందుటుంది.
3 రేగి పండ్లు
ఉన్నబ్, బెర్ అని, కాశీరేగి అని పిలుస్తాం. దీన్ని ఎండిన పండుని వైద్యంలో వాడతారు. దీన్ని ఇండియన్ జుజుబ్ లేదా కామన్ జుజుబ్ అని కూడా పిలుస్తారు. ఇది దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.