calender_icon.png 11 April, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9 నెలలుగా అందని ఆయుర్వేద వైద్య సేవలు

25-03-2025 01:22:00 AM

సిబ్బందిని నియమించని అధికారులు

అశ్వారావుపేట, మార్చి 24(విజయక్రాంతి):  అంగట్లో అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందాన ఉంది జిల్లాలో ఆయుర్వేద వైద్యశాలల తీరు. హాస్పిటల్ ఏర్పాటు చేశారు సిబ్బంది నియామకాన్ని మరిచారు దీంతో ఆయుర్వేద వైద్యశాలలు అలంకారప్రాయంగా నిలిచాయి.

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆయుర్వేద వైద్యం అందించే లక్ష్యంతో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో 1987లో ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేశారు.  మొద ట్లో వైద్య సిబ్బంది ఏర్పాటు నియమించడంతో ప్రజలకు ఆయుర్వేద వైద్యం సక్రమంగా అందింది. ఒక డాక్టరు, ఫార్మాసిస్టు ,ఎస్ ఎన్ వో ను నియమించారు. 2022లో వైద్యాధికారి శోభరాణి అంతర్రాష్ట్ర బదిలీపై ఆంధ్ర ప్రాంతానికి వెళ్లారు.

అప్పటినుంచి వైద్యాధికారి నియామకం జరగలేదు, 9 నెలల క్రితం ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మాసిస్టును కొత్తగూడెంకు బదిలీ చేశారు. ఆయన స్థానంలోనూ ఎవరిని నియమించలేదు. దీంతో ఆ వైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బంది బదిలీ కావటంతో తొమ్మిది నెలలుగా  తలుపులు తెరిచే పరిస్థితి లేదు. ఫలితంగా ప్రజలు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు.ఫలితంగా ఈప్రాంత వాసులకు, స్వల్పకా లిక, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది.

ఉన్న ఒక్క ఎస్‌ఎన్ వోగా పని చేసిన వ్యక్తి పద వీవిరమణ చేయటంతో ఆ పోస్టు ఖాళీ అయింది. గడచిన ఐదు సంవత్సరా లుగా ఒక ఫార్మాసిస్టు మాత్రమే విధులు నిర్వహిస్తూ ఈప్రాం త వాసులకు వైద్యం అందించేవారు. ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోగా ప్రస్తుతం విధులు నిర్వ హిస్తున్న ఫార్మాసిస్టును సైతం సాదారణ బదీలలో బదిలీ చేయటం, ఆస్థానంలో ఎవ రిని నియమించక పోవటంతో నాగుపల్లి ఆ యుర్వేద వైద్యశాల 9 నెలలుగా మూతపడింది.

ఈవిషయం పై ఆయుర్వేద డీపీఎం మహేష్ గౌడ్ నీ వివరణ కోరగా బదిలీలలొ భాగంగా ఆక్కడ పని చేస్తున్న ఫార్మాసిస్టును కొత్త గూడెంకు బదిలీ చేయటం జరిగిందని తెలిపారు. కొత్తగా ఆయుర్వేద వైద్యశాలలో ఖాళీలలను ప్రభుత్వం భర్తీ చేయనుందని వాటిలో నాగుపల్లి వైద్యశాలకు సిబ్బం దీ ని కేటాయిస్తామన్నారు.

వైద్యశాల మూతపడటంతో వైద్యశాలలో ఉన్న మందులు పాడైపోయే  అవకాశం ఉందని ప్రశ్నిం చగా మందులను తమ సిబ్బందితో మానిట రింగ్ చేస్తున్నామని అవసరమైన మందులను కొరత ఉన్న వైద్యశాలలకు పంపిస్తున్నట్లు తెలిపారు. తాను కొత్తగా వచ్చానని నాగుపల్లి ఆయుర్వేద వైద్యశాలను తెరిపించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.