calender_icon.png 3 April, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయుర్వేద వైద్యశాల తలుపులు తెరిచారు

29-03-2025 12:00:00 AM

విధుల్లో చేరిన ఫార్మా సిస్ట్

అశ్వారావుపేట, మార్చి 28 (విజయ క్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మ పేట మండలం లోని నాగుపల్లి గ్రామంలో మూతప డిన ఆయుర్వేద వైద్యశాల ఎట్టకేలకు తెరుచుకుంది. ఈనెల 25న విజయ క్రాంతి’లో తొమ్మిది నెలలుగా అందని ఆయుర్వేద వైద్యం అనే శీర్షిక ప్రచురితమైంది.

దీనిపై స్పందించిన అధికారులు గతంలో నాగుపల్లి వైద్యశాలలో పనిచేసి బదిలి పై వెళ్లిన పార్మాసిస్టు రామకృష్ణను తిరిగి డిప్యుటే షీన్ పై నాగుపల్లి ఆయుర్వేద వైద్యశాలకు నియమిం చారు. అధికారుల ఆదేశాలతో రామకృష్ణ శుక్రవారం నాగుపల్లి ఆయుర్వేద వైద్యశాలను తెరిచి బాధ్యతలు చేపట్టారు.

వారంలో మూడు రోజులు పాటు గురు, శుక్ర, శని వారాలు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.ప్రజలకు ఆయుర్వేద వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. నాగుపల్లి ఆయుర్వేద వైద్యశాలకు నూతనంగా సిబ్బంది నియమిం చేవరకు తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు