calender_icon.png 11 October, 2024 | 3:00 PM

సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ

11-10-2024 12:28:55 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): దసరా సందర్భంగా గురువారం హైదరాబాద్ సిటీ పోలీస్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. అనంతరం సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్ సబ్సిడరీ క్యాంటీన్ ను ప్రారంభించి, సిబ్బందికి సభ్యత్వ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో డీసీపీలు రక్షిత కృష్ణమూర్తి, రాహుల్ హెగ్డే, స్నేహమెహ్ర, శ్వేత, పాటిల్ కాంతిలాల్, ఎన్ భాస్కర్, బి కిష్టయ్య పాల్గొన్నారు. 

అంబర్‌పేట హెడ్ క్వార్టర్స్‌లో.. 

రాచకొండ సీపీ సుధీర్‌బాబు అంబర్‌పేటలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. రాచకొండ అడ్మిన్ డీసీపీ ఇందిర, అడిషనల్ డీసీపీ శ్యాంసుందర్ పాల్గొన్నారు.