అయోధ్య, నవంబర్ 27: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయ వార్షికో త్సవ వేడుకలను జనవరిలో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటినుంచే ఏర్పాట్లను రామతీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు ముమ్మరం చేస్తున్నారు. 2024 జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించారు.
జనవరి 22న కాకుండా పది రోజుల ముందే జనవరి 11న ఈ వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం ఆంగ్ల క్యాలెండర్ కాకుండా హిందూ తిథి ప్రకారం తేదీని నిర్ణయించారు. ఏటా పుష్య శుక్ల ద్వాద శి అంటే కూర్మ ద్వాదశి నాడు ఈ ఉత్సవం జరపాలని పండితులు నిర్ణయించారు.