calender_icon.png 31 October, 2024 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేదీప్యమానంగా అయోధ్య

31-10-2024 01:28:55 AM

  1. 25లక్షల ప్రమిదలతో దీపోత్సవం 
  2. 2 గిన్నిస్ రికార్డులు కైవసం

అయోధ్య, అక్టోబర్ 30: అయోధ్యలో బాలరాముడు కొలువైన తర్వాత వచ్చిన మొదటి దీపావళి వేడుకలను యూపీ ప్రభుత్వం బుధవారం ఘనంగా జరిపించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా వేడుకలు ప్రారంభమయ్యాయి. యోగి ప్రత్యేక పూజలు చేసి, హారతి ఇచ్చారు. అనంతరం సహచర మంత్రివర్గ సభ్యులతో దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సరయూ నది ఒడ్డుపై 25 లక్షల దీపాలను వెలిగించడంతో నగరమంతా మెరిసిపోయింది. నదిలోని 10వ ఘాట్ వద్ద 80వేల ప్రమిదలను స్వస్తిక్ గుర్తులో అమర్చారు. నది ఒడ్డున సుమారు ౬ వేల మంది అతిథులు బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో 40 ఎల్‌ఈడీ స్క్రీన్లలో దీపోత్సవాన్ని ప్రత్యేక్ష్య ప్రసారం చేశారు.

మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేసియా, కాంబోడియా, ఇండోనేసియా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 10వేల మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 30వేల మంది వలంటీర్లు దీపోత్సవంలో పాల్గొన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు డ్రోన్‌ల సాయంతో ప్రమిదలను లెక్కించి రెండు రికార్డులను ప్రకటించారు.