న్యూఢిల్లీ, జనవరి 16: ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ స్టాండెలోన్ నికరలాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్వల్పంగా 4 శాతం పెరిగి రూ. 6,304 కోట్లకు చేరింది. గత క్యూ3లో బ్యాంక్ రూ. 6,071 కోట్ల స్టాండెలోన్ లాభాన్ని నమోదుచేసింది. తాజాగా ముగిసిన క్యూ3లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 33,516 కోట్ల నుంచి రూ. 36,926 కోట్లకు చేరింది.
నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధిచెంది రూ. 12,532 కోట్ల నుంచి రూ. 13,606 కోట్లకు పెరిగింది. 3.93 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించింది. స్థూల మొండి బకాయిలు 1.58 శాతం నుంచి 1.46 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 0.36 శాతం నుంచి 0.35శాతానికి తగ్గినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.