టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (విజయక్రాంతి): యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా టీజీఏఎన్‌బీ ఆధ్వర్యంలో ‘డ్రగ్ ఫ్రీ వెల్‌నెస్’ అనే ప్రోగ్రాంను ప్రారంభించినట్లు టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. శనివారంఆయన మాట్లాడుతూ.. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీజీఎన్‌బీ).. ఎడిస్టీస్ ఫౌం అండ్ క్రియేట్ ఎడ్యుటెక్ అనే సం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.
ఈ ఆన్‌లైన్ ప్రోగ్సామ్ రాష్ట్రంలోని యువతను శక్తివంతం చేయడం కోసం కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం. బాధ్యతాయుతమైన జీవితాన్ని కొనసాగించేలా వారిని తీర్చిదిద్దడం. విద్యార్థుల జీవితాలను మత్తు మహమ్మరి నుంచి కాపాడడానికి తల్లిదండ్రులు, విద్యాసంస్థల సహాయంతో ముందుకు సాగడం అని వివరించారు.
ఈ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు టీజీఏఎన్‌బీ, భాగస్వామ్యులు సంయుక్తంగా జారీ చేసిన ధృవీకరణ పత్రం అందజేయబడుతుందన్నారు. క్రియేట్ ఎడ్యుకెట్ అండ్ ఎడిస్టీస్ ప్రతినిధులు సంస్కృతి కొండూరు, శ్రీహర్షిత చాడా వరుస కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థుల్లో అవగాహన పెంపొం కృషి చేయాలని చెప్పారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది యువతను డ్రగ్ ఫ్రీ వెల్‌నెస్ కోర్సును తీసుకునేలా చర్యలు చేపడతామని క్రియేట్ ఎడ్యుకెట్ అండ్ ఎడిస్టీస్ ప్రతినిధుల్లో ఒకరైన సంస్కృతి కొండూరు అన్నారు. ఈమె ఎస్‌ఐబీ ఇన్‌స్పెక్టర్ జనరల్(ఐజీ) సుమతి కుమార్తె కావడం గమనార్హం.