27-03-2025 11:04:12 PM
తాడ్వాయి (విజయక్రాంతి): పాఠశాలలో మౌలిక వసతులపై అవగాహన పెంచుకోవాలని తాడ్వాయి ఎంఈఓ రామస్వామి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలలో గురువారం పాఠశాలలోని మౌలిక వసతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పెండింగ్ ఆఫ్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని సోమారం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు మౌలిక వసతులపై అవగాహన కల్పించారు. కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి అనే విషయంపై విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.