calender_icon.png 26 December, 2024 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంపొందించుకోవాలి

02-12-2024 02:02:21 PM

మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని, (విజయక్రాంతి): నగదు రహిత లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని కెడిసిసి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత- నగదు రహిత లావాదేవీలపై మండలంలోని పుట్టపాక గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. బ్యాంకుల లావాదేవీలన్ని డిజిటలీకరణ జరిగినందున ప్రతి ఒక్కరు ఆర్థిక లావాదేవీలపై, నగదు రహిత లావాదేవీలపై అవగాహన ఏర్పర్చుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత రైతులు, ప్రజల ఆర్థిక, జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సహకార బ్యాంక్, సంఘాల ద్వారా అందిస్తున్న ఋణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కెడిసిసి బ్యాంక్ మంథని మేనేజర్ కె. ఉదయశ్రీ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరిగి పోతున్నందున ఏటిఎం పిన్ నెంబర్లు, ఓటీపీ పాస్వర్డ్స్ ఇతరులతో పంచుకోరాదని, ఎటిఎం కార్డు పిన్ నంబర్లు తరుచుగా మార్చుకోవాలని సూచించారు. సహకార బ్యాంక్ ద్వారా పాడి పశువులు, గొర్రెలు, పండ్లు, ఆయిల్ ఫాం తోటల పెంపకం, పాలీహౌస్లు, పవర్ టిల్లర్స్, గోదాంలకు, ట్రాక్టర్స్, హర్వేస్టర్లు, గోల్డ్ లోన్స్, స్వయం సహాయక సంఘాలకు, గృహ నిర్మాణాలు, కొనుగోళ్లకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు వ్యక్తిగత, విదేశీ విద్యా, మార్టిగేజ్, ఎస్ హెచ్ జి, జె ఎల్ జి, ఇళ్ల రిపేరుకు, ఇంటిరియర్ డెకరేషన్స్ కు, పిఎంఇజిపి, కార్పొరేషన్ ఋణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఫిక్స్ డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 7.60శాతం, సీనియర్ సిటిజన్స్ కు 8.10శాతం వడ్డీ కల్పిస్తున్నామని, సాధారణ పౌరులకు కుమ్యులేటివ్ ఇంట్రెస్ట్ తో కలిపి 7.82 శాతం, సీనియర్ సిటిజన్స్ కు 8.35 శాతం కల్పిస్తున్నామని తెలిపారు. అంతేగాకుండా బ్యాంక్ లాకర్ సదుపాయం ఉందని తెలిపారు. అలాగే సహకార బ్యాంక్ ద్వారా అందిస్తున్న యూపిఐ, ఐఎంపిఎస్, గూగుల్ పే, ఫోన్ పే, ఆన్లైన్ సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంక్ యందు ఖాతా కలిగిన ప్రతి ఒక్క ఖాతాదారుడు తమ ఈ ఆధార్ బ్యాంక్ లో సమర్పించి కె వైసి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డిఈ దిలీప్, అసిస్టెంట్ మేనేజర్లు పోతరాజు సతీష్, బూడిద వసంత, సిబ్బంది యం.మహేందర్, అమరేందర్, కె.రమేష్, నాయకులు చాట్లపల్లి సంతోష్, ఎడ్ల శ్రావణ్, సవాయి గణేష్, కన్నూరి సుదర్శన్, రేపాక శంకర్, పెద్ద సంఖ్యలో బ్యాంకు ఖాతాదారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.