calender_icon.png 20 September, 2024 | 8:01 PM

నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలి

19-09-2024 12:36:44 AM

జలశక్తి అభియాన్ చీఫ్ నోడల్ ఆఫీసర్ సుశీల్‌కుమార్ సింగ్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): నీటి సంరక్షణలో మహిళలు కీలక భూమిక పోషించాలని జలశక్తి అభియాన్ చీఫ్ నోడల్ ఆఫీసర్ సుశీల్‌కుమార్ సింగ్ అన్నారు. బుధవారం ‘జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ నారి శక్తి సే జలశక్తి’ అనే కార్యక్రమంపై కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన తో పాటు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుశీల్‌కుమార్ మాట్లాడుతూ.. నీటి సంరక్షణ, భూగర్భజలాలు, నీటి వనరుల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడు తూ.. నీటి సంరక్షణలో హైదరాబాద్ జిల్లాను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. జిల్లాలోని 691 ప్రభుత్వ పాఠశాలల్లో ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కార్యక్రమం ద్వారా ఇంకుడు గుం తలను నిర్మించినట్లు తెలిపారు. నీటి పునరుద్ధరణ కోసం వాటర్ రీచార్జ్జి గుంతలను ఏర్పాటు  చేసినట్లు చెప్పారు.