16-04-2025 12:00:00 AM
నారాయణపేట.ఏప్రిల్ 15(విజయక్రాంతి) : భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పనకు,రెవిన్యూ గ్రామాల్లో 17వ తేదీ నుంచి రెవిన్యూ టీం లు సందర్శించి ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో తాసిల్దారులు ఆర్ ఐ లతో సమావేశం నిర్వహించిభూ భారతి చట్టాన్ని అమలు పైలెట్ ప్రాజెక్టుగా మొట్టమొదటిసారిగా జిల్లాలో ని మద్దూరు మండలాన్ని ఎంపిక చేసిందని అన్నారు. ఈ మండలంలో భూనిర్వాసితులు వారి సమస్యలను తీర్చుటకు రెవెన్యూ సిబ్బందికి ప్రతి ఒక్కరు భూములకు సంబంధించిన దస్తావేజులు అన్ని డాక్యుమెంట్లు తమ వెంట ఉంచుకోవాలని తెలిపారు.
17వ తేదీ నుంచి రెవిన్యూ టీం లు ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులపై గ్రామ సదస్సులను నిర్వహించి భూ భారతి చట్టం ప్రకారం అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈనెల 17న మద్దూరు మండలానికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై చట్టాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ బెన్ శాలం, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత గంగ్వార్,ఆర్. డి. ఓ. రాంచందర్, తాసిల్దార్ లో ఆర్ ఐ. లు తదితరులు పాల్గొన్నారు.