ప్రొఫెసర్ కోదండరామ్
ముషీరాబాద్, నవంబర్ 14 : మూసీని పునరుజ్జీవింపజేయాల్సిందేనని పలువురు వక్తలు అభిప్రాయప డ్డారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ‘హైడ్రా కార్యకలాపాలు నది ప్రక్షాళన మధ్య తరగతి బాధితులకు ప్రత్యామ్నాయం’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సెమి నార్కు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్, ప్రొఫెసర్ హరగోపా ల్, ప్రముఖ సంపాదకులు డాక్టర్ శ్రీనివాస్, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ..మూసీ పునరు జ్జీవన ప్రక్రియతో ప్రభావితం కానున్న బాధితులతో ముందుగా ప్ర భుత్వం చర్చించాలని సూచించారు. ప్రతి బాధితుడికి న్యాయం చేయాలన్నారు.