calender_icon.png 4 February, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విపత్తుల నిర్వహణ, తక్షణ స్పందనపై అవగాహన కల్పించాలి

04-02-2025 12:00:00 AM

జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): విపత్తుల నిర్వహణ తక్షణ స్పందన తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్  సత్యప్రసాద్  అధ్యక్షతన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బందం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశంలో విపత్తు నిర్వహణ, తక్షణ చర్య లు, సహాయ కార్యక్రమాలపై సమగ్రం గా చర్చించారు.

సమావేశంలో ప్రకతి విపత్తులు, ముఖ్యంగా వరదలు, భూకం పాలు, తుపాన్ల వంటి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరంగా చర్చించారు. జిల్లా అధికారులు, రెవెన్యూ, పోలీస్, అగ్ని మాపక, వైద్య ఆరోగ్య, పంచాయతీ రాజ్, మునిసిపల్, విద్యుత్, రోడ్లు-భవనాలు, తాగునీరు, పౌర సరఫరా తదితర శాఖల అధికారులు సమావే శంలో పాల్గొన్నారు.

ఎన్డిఆర్‌ఎఫ్ బందం విపత్తు సమయంలో ప్రజలను రక్షించే విధానాలు, సహాయ చర్యలు, అత్యవసర సేవల అందుబాటును మెరుగుపరచడం, విపత్తు నివారణ చర్యలపై  సమీక్షించారు. గత అనుభవా లను పరిగణనలోకి తీసుకుని, విపత్తు నిర్వహణలో మెరుగైన విధానాలను అమలు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, “జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సమన్వయం అత్యంత కీలకం అని,విపత్తు సమయం లో వేగంగా స్పందించే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాల న్నారు. ముందస్తు ప్రణాళికలు, అప్రమత్తతతో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి” అని తెలిపారు.

ఎన్ డి ఆర్ ఎఫ్ బందం త్వరలో జిల్లాలో విప త్తు నిర్వహణ మాక్ డ్రిల్ (అభ్యాసం) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టను న్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి ముఖేష్ కుమార్ ఆర్డిఓ మధుసూదన్ కలెక్టరేట్ ఏవో హనుమంతరావు మరియు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.