26-03-2025 11:47:12 PM
పటాన్ చెరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఆకస్మిక తనిఖీ..
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్..
సంగారెడ్డి (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. బుధవారం పటాన్ చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీసులకు పలు సూచనలు చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను, స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రికార్డ్ అప్ టు డేట్ ఉండాలని అన్నారు. అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ భాద్యతాయుతంగా విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
పటాన్ చెరు హైదరాబాద్ లో భాగమని, అధిక ట్రాఫిక్ రద్దీ అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయడం, సంబంధిత అధికారులతో మాట్లాడి బోలార్డ్స్ వేయించడం, విజిబుల్ పోలిసింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్నారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, పటాన్ చెరు డియస్పి రవీందర్ రెడ్డి, పటాన్ చెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.