వనపర్తి, జనవరి 12 (విజయక్రాంతి) : యువజన క్రీడోత్సవాల సందర్భంగా, చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వన పర్తి పట్టణంలోని జూనియర్ కళాశాల మై దానంలో, ఇండోర్ స్టేడియంలో నిర్వహిం చిన చెస్ రాష్ర్టస్థాయి పోటీలను, ఫుట్ బాల్ పోటీలను ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే చదువుతోపాటు క్రీడల్లోనూ తర్ఫీదు ఇవ్వా లని క్రీడల వలన దేహదారుడెం సమకూ రడంతో పాటు మానసికోలాసం లభిస్తోం దని ఆయన అన్నారు.
రాష్ర్ట ప్రభుత్వం క్రీడ లపై ప్రత్యేక దష్టి సారించిందని ప్రతి నియో జకవర్గ మండల స్థాయిలలోనూ క్రీడా మైదానాలను అందుకు కావలసిన సామా గ్రిని పూర్తిస్థాయిలో అందించి క్రీడాకారు లను ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే తెలిపా రు.
ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను ఆయన అభినందిం చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మ న్ పాకనాటి కష్ణయ్య, కౌన్సిలర్లు చీర్ల సత్యం, విభూతి నారాయణ,వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్,, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వనపర్తి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, స్థానిక కౌన్సిలర్ బ్రహ్మం చారి, కౌన్సిలర్లు చీర్ల సత్యం, వెంకటేష్, నారాయణ రాము లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.