calender_icon.png 19 March, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలి

19-03-2025 01:15:36 AM

జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామచందర్ 

మేడ్చల్, మార్చి 18 (విజయ క్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను ఉపయోగించుకొని ఎస్సీ వర్గ ప్రజలు సమాజంలో మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించుకొనెందుకు, ఆర్థిక ప్రయోజనాన్ని  పొందేవిధంగా అవగాహాన కల్పించాలని షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ జిల్లా అధికారులను ఆదేశించారు.

మంగళవారం   మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ విసి హాల్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి  జాతీయ కమీషన్ డైరెక్టరు జి.సునిల్ కుమార్ తో కలిసి కమీషన్ సభ్యులు వడ్డెపల్లి రాంచందర్  హాజరయ్యారు. షెడ్యూల్ కులాలకు హక్కుల పరిరక్షణ చట్టం, ఎస్సీలు నిరాదరణకు గురైన సందర్భంలో అనుసరించాల్సిన విధివిధానాలు, బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం కోసం రూపొందించిన చట్టాల అమలు తీరును కమీషన్ సభ్యులు శాఖల వారిగా సమీక్షించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  అందించే సబ్సిడీ, వడ్డీ లేని రుణాల పథకాలు ఎస్సీ వర్గాలకు అందేలా ప్రజలలో అవగాహాన కల్పించే విధంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు ప్రభుత్వం  అందించే ఎక్కువ సబ్సిడిరుణాల గురించి మహిళలకు అవగాహాన కల్పించి పారద్శకత పాటిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. పరిశ్రమల శాఖ ద్వారా స్వయం ఉపాధి కై చిన్న కుటీర పరిశ్రమలు నెలకొలిపేందుకు ఔత్సాహిక యువతను ప్రేరేపించాలని సభ్యులు సూచించారు. 

ఎస్సీ, ఎస్టీరెసిడెన్షియలఅ హాస్టళ్లలో విద్యార్థులకు  మెను చార్ట్ ప్రకారం  అల్హాహారం, భోజనం అందిస్తున్నారా అని సభ్యులు అడిగి తెలుసుకున్నారు. సభ్యులు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందించే పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిపుల ద్వారా జిల్లాలో ఎంత మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఎస్సీ అభివృద్ది శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు అందించే స్కాలర్ షిప్పులు ఆలస్యమైనట్లయితే విద్యార్థుల అడ్మిషన్ లలో ఇబ్బంది కలుగకుండా కాలేజీల యాజమాన్యానికి, స్కాలర్ షిప్ ద్వారా ఫీజు చెల్లిస్తామని లిఖితపూర్వకంగా లేఖలను అందజేయాలని ఎస్సీ అభివృద్ది శాఖ అధికారికి సూచించారు. 

 ఎస్సీ, ఎస్టీ  అట్రాసిటి కేసులలో కుల ధృవీకరణ సర్టిఫికెట్ లేనందువల్ల జాప్యం కలుగకుండా సంబంధిత తహాసీల్దారు ధృవీకరణ పత్రాలను త్వరితగతిన అందించాలని సూచించారు. అట్రాసిటి కేసులలో ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసి బాధితులకు అందించే ఆర్థిక సహయాన్ని వెంటనే అందించి వారికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసు అధికారులను సూచించారు. ఎక్సైజ్ శాఖ ద్వారా మద్యం దుకాణాలు ఎస్సీ వర్గాలకు కేటాయించిన వాటిని ఎస్సీలకు మాత్రమే అందించాలని, వారు ఇతరులకు అమ్ముకుంటే వారి పై  చర్యలు తీసుకోవాలని, ఎస్సీలకు కేటాయించిన వాటిని ఎస్సీలకే అందించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారికి సభ్యులు సూచించారు. ఈ సమావేశంలో మల్కాజ్గిరి, మెడ్చల్ డి సి పిలు  పద్మజ, కోటిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి, డిఆర్‌ఓ హరిప్రియ, ఆర్డిఓలు శ్యాంప్రకాష్, ఉపేందర్ రెడ్డి,  ఎసిపిలు, పోలీసు శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.