calender_icon.png 19 January, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి

19-01-2025 12:00:00 AM

‘ఖాకీ కిడ్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్

సిరిసిల్ల, జనవరి 18 (విజయక్రాంతి) : సైబర్ నేరాల నియంత్రణయే లక్ష్యంగా విద్యార్థి దశ నుండి విద్యార్థులకు సైబర్ నేరలపై,ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పించి, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయడం అభినందనీయమని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ఖాకీ కిడ్స్’ కార్యక్రమము ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసలతో ప్రజలను మోసాగిస్తున్నారని, అట్టి మోసాల బారిన ప్రజలు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రతి పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్‌లను ఎంపిక చేసి, వారికి సైబర్ నేరాలు జరుగు విధానం,ట్రాఫిక్ నియమలపై శిక్షణ ఇచ్చి జిల్లాలో ఉన్న అన్ని కళాశాల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు ఇంటర్నెట్ దుర్వినియోగం, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ మోసాల భారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నారు.

విద్యార్థులు ఖాకి కిడ్స్ కార్యక్రమన్ని సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రుల కి, కుటుంబ సభ్యులకు, ప్రజలకు అవగాహన కల్పింఛాలన్నారు. అనంతరం ఎస్పీ  అఖిల్ మహజీద్  మాటాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ స్వరూప,డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు కృష్ణ, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, ఆర్.ఐ లు మధుకర్, రమేష్ ,ఎస్.ఐ లు , విద్యార్థులు పాల్గొన్నారు.