16-03-2025 12:00:00 AM
ఆస్రా ఫౌండర్, సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వకేట్ హబీబ్ సుల్తాన్ అలీ
ముషీరాబాద్, మార్చి 15: (విజయ క్రాంతి) : వినియోగదారుల హక్కుల చట్టం వచ్చి 35 ఏళ్లు గడుస్తున్నా చట్టంపై ప్రజలకు అవగాహన లేదని ఆస్రా(అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్) ఫౌండర్, సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వకేట్ హబీబ్ సుల్తాన్ అలీ అన్నారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం వర్క్‌షాప్‌పై ప్రచారాలు నిర్వహించాలన్నారు. ఈ మేరకు శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకొని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆస్రా ప్రతినిధులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థ ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు ఎన్నో కేసులు పరిష్కరించామని తెలిపారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిరక్షణ చట్టాల అమలును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే వ్యాపార సంస్థలు, పాలకులు, వినియోగదారులు కలిసికట్టుగా న్యాయమైన మార్కెట్ వాతావర ణాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఫిర్యాదుల పరిష్కార విధానం, వినియోగదారుల కోర్టుల్లో వేగంగా వివాద పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటల్ వినియోగదారుల రక్షణ, ఆన్లైన్ మోసాలను నివారించడం, డేటా భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ ఎన్. వెంకటేష్ గుప్త, నేషనల్ లీగల్ కో-ఆర్డినేటర్స్ అడ్వకేట్ హరికుమార్, అడ్వకేట్ శివకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరేష్, వైస్ ప్రెసి డెంట్ శ్రీధన్య, పీఆర్‌ఓ ప్రశాంత్, హైదరాబాద్ మాజీ సభ్యులు కైలాష్, బీఎన్‌ఎస్ రాజు, రంజిత్ కుమార్, రాష్ట్ర సభ్యులు ప్రవీణ, మహబూబ్ భాషా పాల్గొన్నారు.