calender_icon.png 19 April, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెదురు సాగుపై అవగాహన కల్పించాలి

19-04-2025 07:37:50 PM

సెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలో వెదురు సాగుపై రైతులకు అవగాహన కల్పించి, వెదురు సాగు చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని సెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత(Serp Pharma Director Rajitha) అన్నారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లాలోని ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సీఈవోలు, జిల్లా సమాఖ్య సభ్యులు, ఏపీఎం లతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి సెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో భాగంగా 2025-26  ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన మిర్చి కొనుగోలు వివరాలను డైరెక్టర్ రజిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ పీసీల ద్వారా ఇప్పటివరకు సుమారు ఒక కోటి రూపాయల టర్నోవర్ చేశారని ఇంకా టర్నోవర్ పెంచాలని అధికారులకు సూచించారు. గుండాల, ములకలపల్లి, చండ్రుగొండ మండలంలో వెదురు రైతులకు గుర్తింపు ఆన్లైన్ నందు డేటా ఎంట్రీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో రైతులకు వెదురు సాగువల్ల కలిగే లాభాలు గురించి అవగాహన కల్పించాలని సూచించారు. సమీకృత వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించాలని, నాచురల్ ఫార్మింగ్ సీఆర్పీల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించారు. మునగసాగు, మునగాకుల సేకరణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎఫ్ పి సి కోఆర్డినేటర్ శ్రీనివాస్, టిపిఎం ఫార్మా వెంకయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.