19-04-2025 01:10:12 AM
కలెక్టర్ గౌతమ్
మేడ్చల్,ఏప్రిల్ 18(విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన ఆర్‌ఓఆర్ చట్టం భూభారతి పై జిల్లాలో ఈనెల 19 నుంచి 26 వరకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని కలెక్టర్ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, రైతులు, రైతు సంఘాలు, ప్రభుత్వవేతర సంస్థలకు భూభారతిపై అవగాహన సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
జిల్లాలో మండల స్థాయిలో 19 నుంచి 26వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈనెల 19న మూడు చింతలపల్లి మండలంలోని కేశవ రం గ్రామంలో సూపర్ సంగీత్ ఫంక్షన్ హా ల్ లో ఉదయం 10:30 గంటల నుంచి అవగాహన సదస్సు ఉంటుందని వివరించారు. ఈ అవగాహన సదస్సులో ప్రజలు, రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.