17-04-2025 04:17:09 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్, అగ్నిమాపక శాఖ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో వృత్తిరీత్యా అమరులైన అగ్నిమాపక సిబ్బందికి గురువారం నివాళి అర్పించారు. వారికి నివాళి అర్పిస్తూ కామారెడ్డి మున్సిపాలిటీ నుండి అగ్నిమాపక సిబ్బంది కార్యాలయం వరకు క్యాండిల్ ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శనలు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరిస్తూ పలు రకాల కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నపూర్ణ, వైస్ ప్రిన్సిపల్ ఎన్సిసి కోఆర్డినేటర్ డాక్టర్ నవీన్ కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ టి హరీష్, అధ్యాపకులు మామిండ్ల అజయ్ కుమార్ రమేష్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.