calender_icon.png 10 March, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా చట్టాలపై అవగాహన సదస్సు

10-03-2025 07:39:15 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి హాజరై మాట్లాడారు. సాధన ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టీ.నాగరాణి హాజరైనారు. కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ... మహిళా చట్టాలు వారి హక్కుల గురించి వివరించారు. బాల్య వివాహాల గురించి, పిల్లలపై జరిగే వేధింపులు, POCSO చట్టం, పలు విషయాలు వివరించారు. పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచాలి. తల్లి దండ్రుల కష్టం పిల్లలకి తెలియాలి. అన్ని విషయాలు మీతో పంచుకునేలా ఉండాలి.

పిల్లల్ని పాజిటివ్ గా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పిల్లలు బాధ్యతాయుతంగా ఉండి చదువులపై శ్రద్ధ పెట్టి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ముఖ్యంగా ఆడ పిల్ల అని అశ్రద్ధ చేయకుండా మంచిగా చదివించి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని అన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే న్యాయపరమైనవి, చట్ట పరమైన సమస్యలున్నా ఇతర విషయాల్లో మీకు ఏ ఇబ్బంది కలిగిన టోల్ ఫ్రీ నెంబర్ 15100 కి కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో CWC స్వర్ణలత, DCPO స్రవంతి, MRO గంగ సాగర్, MEO యూసుఫ్, MPDO సంతోష్ రెడ్డి, హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ నాగరాజు, సెక్రటరీ మాధవి లతా, సాధన టీం, DLSA & LADCS సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.