calender_icon.png 7 February, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాల దుష్ఫలితాలపై అవగాహన సదస్సు

07-02-2025 12:00:00 AM

యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): మహాత్మా జ్యోతిబ ఫూలే తెలంగాణ బి. సి వెల్ఫేర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవిలత విద్యార్థులకు బాలల హక్కులు, లీగల్ సర్వీసెస్ యూనిట్ చిల్డ్రన్, మాదక ద్రవ్యాల వలన దుష్పలితాలు సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించారు.

తదుపరి ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు పి ఒ ఎస్ హెచ్ చట్టంపై సిబ్బందికి అవగాహన కల్పించారు మరియు పాఠశాలలో వసతులు, భోజనము పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్  శ్రీనివాస్,   సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా సేవలు అందిస్తున్న పారా లీగల్ వాలంటీర్ల సేవలను సమీక్షించి తగు సూచనలు చేసారు.