calender_icon.png 31 March, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ, నిషేధిత పత్తి విత్తనాలపై కఠిన చర్యలు తప్పవు

28-03-2025 05:00:52 PM

జిల్లా వ్యవసాయ అధికారి కల్పన

హాజీపూర్,(విజయక్రాంతి): నకిలీ, నిషేధిత పత్తి విత్తనాలు అమ్మిన, రైతులు కొన్న, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి కల్పన హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని గుడిపేట రైతు వేదికలో పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, టాస్క్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నకిలీ, నిషేధిత పత్తి విత్తనాలపై అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి కల్పన మాట్లాడుతూ..... రైతులందరూ నకిలీ, నిషేధిత పత్తి విత్తనాలపై అవగాహన కలిగి ఉండాలి అన్నారు. గ్లైసిడ్ బిటి ఎవరి వద్దనైనా ఉన్న సంబంధిత పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ, టాస్క్ స్పోర్ట్స్ అధికారులకు సమాచారం ఇచ్చినచో వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గ్లైసిడ్ బీటీ వాడడం వల్ల రైతులందరూ క్యాన్సర్ బారిన పొడి రోగాల పాలు అవడం జరుగుతుందని వివరించారు. రైతులు వ్యవసాయంలో కొత్త పద్ధతులను అనుసరించాలని సూచించారు. పంట మార్పిడి విధానాన్ని రైతులందరూ అలవర్చుకోవాలన్నారు. పత్తి విత్తనాలు కొన్న షాప్ యజమానుల వద్ద తప్పకుండా రసీదు పొంది ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు అనిత, హాజీపూర్ తాసిల్దార్ శ్రీనివాస్ దేశ్పాండే , ఎస్సై సురేష్, మండల వ్యవసాయ అధికారి కృష్ణ, లక్షెట్టిపేట మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఏఈవోలు, నూజివీడు,రాశి,రాయల్ సీడ్ కంపెనీల ప్రతినిధులు, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్, మాజీ సర్పంచ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.