25-02-2025 01:56:39 AM
కొత్తపల్లి, ఫిబ్రవరి24: కరీంనగర్ లోని సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్ లో 7,8,9, 10 వ తరగతి విద్యార్థులకు తెలంగాణ అంటీ నార్కోటిక్స్ బ్యూరో సీఐ ఎమ్. కృష్ణమూర్తి డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే భయంకరమైన దుష్ర్పభావాల గురించి అవగాహన కల్పించారు.
కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను పాఠశాల అధ్యక్షులు బల్మూరి కరుణాకర్ రావు, కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నా రెడ్డి , సమితి అధ్యక్షులు డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, సమితి కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ, విభాగ్ కార్యదర్శి మేచినేని దేవేందర్ రావు, సహ కార్యదర్శి కొండా గంగాధర్, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, డాక్టర్ నాళ్ల సత్య విద్యాసాగర్, తాటి రాజేశ్వర రావు, చందా సుధాకర్, మొండయ్య, కేశెట్టి మహేష్, బన్నా సుధాకర్, తదితరులు హర్షం వ్యక్తం చేశారని పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి తెలిపారు.