calender_icon.png 20 April, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22న భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

20-04-2025 05:29:35 PM

చిట్యాల తహసిల్దార్ హేమ...

చిట్యాల (విజయక్రాంతి): 22వ తేదీన భూభారతి 2025 రెవెన్యూ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు చిట్యాల తహసిల్దార్ హేమ(Tahsildar Hema) ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని, కావున రైతుల అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఇందులో ప్రజల కోసం, ప్రత్యేకించి రైతులకు వారి భూములపై భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్‌లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభించనున్నదని తెలిపారు. భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై ఏవైనా అభ్యంతరాలుంటే భూ భారతి ప్రకారం అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు.