18-04-2025 12:28:04 AM
కూసుమంచి , ఏప్రిల్ 17 :-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై గురువారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండ లంలో అవగాహన సదస్సు నిర్వహించారు.. ఈ భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయ ల నాగేశ్వరరావు పాల్గొనీ మాట్లాడారు.
గత ప్రభుత్వం తీసుకోచ్చిని ధరణి పోర్టల్ రైతులకు ఉపయోగపడలేదన్నారు.. వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చెప్పిన విష యం గుర్తు చేశారు.. ఇచ్చిన వాగ్దానం మేర కు ప్రజలకు ఉపయోగపడే పోర్టల్ తీసుకు వచ్చామని చెప్పారు.. భూభారతి చట్టంతో రైతులకు సంబంధించి సమస్యల పరిష్కారం సులువుతుందని అన్నారు, గతంలో ధరణి చట్టంలో ఇలాంటి అవకాశం లేక కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేది కాగా కొత్త చట్టం ద్వారా ప్రతి డిసెంబర్లో గ్రామ రికార్డును ముద్రిస్తారన్నారు..
భూభారతి చట్టం అమలుకు నేలకొండపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం హర్షనీయన్నారు.. భూముల సమస్యలను పరిష్కారా నికి ఒక మంచి అవకాశం అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీజ, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఆర్. డి.ఓ.నరసింహరావు , ఏడిఏ సరిత ,మార్కె ట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు తదితరులు పాల్గొన్నారు..