28-03-2025 12:00:00 AM
తుంగతుర్తి, మార్చి 27 : ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్ మండల కేంద్రం లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల లో సైబర్ నేరాలపైన, ఆన్ లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. సైబర్ మోసాలపై1930టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. మైనార్టీ బాలుర గురుకుల ప్రిన్సిపల్ ఉమారెడ్డి, కానిస్టేబుల్ రవి కుమార్, రమేష్, సాయి, పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ యల్లయ్య, గోపయ్య, ఈశ్వర చారి, కృష్ణ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.