జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో శుక్రవారం రోజు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో గల సలాబత్పూర్ ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద ఆర్టిఓ అధికారి కవిత(RTO Officer Kavitha) సిబ్బందితో కలిసి ప్రజలకు రోడ్డు ప్రయాణాలపై భద్రత పాటించుటకై రోడ్డు ప్రమాదాల అవగాహన వారోత్సవాల భాగంగా సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అదేవిధంగా కార్లు నడిపే వాళ్ళు సీటు బెల్టు తప్పకుండా ధరించాలని రోడ్డు నియమాలను పాటిస్తూ ప్రయాణం కొనసాగించాలని అతివేగం మద్యం సేవించి వాహనాల తోలడం వలన ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని కావున జాగ్రత్త వహించాలని సూచించారు. అదేవిధంగా ఎవరైతే ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధరించి కారు నడిపేవారు సీటు బెల్టు ధరించి ప్రయాణం చేస్తున్న వారిని రోడ్డు నియమాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఓ అధికారిని కవిత సిబ్బంది పాల్గొన్నారు.