28-03-2025 07:47:40 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పంట కోతల అనంతరం ధాన్యం నిల్వల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర గిడ్డంగుల సంస్థ (సీడబ్ల్యుసీ) ఆదిలాబాద్ మేనేజర్ వరికుంట రవికుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు . రైతులందరూ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని, నిలువచేసిన అన్ని రకాల ధాన్యాలను ఎలుకలు ఉడతలు లక్కపురుగులు వివిధ క్రిమి కీటకాలను నివారించే పద్ధతులను రైతులకు క్షుణ్ణంగా ఈ సందర్భంగా వివరించారు. అదేవిధంగా రైతులకు అవగాహన కల్పించేందుకు స్థానిక సీడబ్ల్యుసీ గోదాం వద్దకు రైతులను తీసుకెళ్లి నిల్వ పద్ధతులను క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా హాజరైన రైతులందరికీ కిలో చొప్పున ఎరువు, ఒక క్వింటాల్ సామర్థ్యం గల లోహపు డబ్బా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి మిలింద్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ విజయేందర్ రెడ్డి ఏఈవోలు చిరంజీవి, రాము ,దమ్మదాన్, సిడబ్ల్యుసి ఆదిలాబాద్ సూపర్డెంట్ గౌతమ్, సిబ్బంది సాయి, ఫణీంద్ర, ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ అధికారి శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.