calender_icon.png 13 March, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేలుజాతి దూడల ప్రదర్శన పాడి రైతులకు అవగాహన సదస్సు

13-03-2025 01:31:05 AM

బూర్గంపాడు,మార్చి 12(విజయక్రాంతి):బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామంలో బుధవారం ఐటిసి బంగారు భవిష్యత్ ప్రోగ్రాం ద్వారా బైఫ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మేలుజాతి దూడల ప్రదర్శన వాటి పెంపకంపై పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మొరంపల్లి బంజర్ పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మొత్తం 75 మేలుజాతి ఆవులు, గేదెలు, దూడలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాడి రైతులకు పశుపోషణ, సాంకేతిక విధానాలు, ఆధునిక పద్ధతులపై వివరంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఐటిసి బంగారు భవిష్యత్ ప్రోగ్రాం ముఖ్య అధికారి జయప్రకాష్,బైఫ్ సంస్థ రాష్ట్ర ముఖ్య అధికారి హేమంత్,బైఫ్ సంస్థ క్షేత్ర అధికారి సదయ్య, టెక్నీషియన్ వెంకటరామిరెడ్డి, గ్రామస్థులు, రైతులు, పశుపోషకులు పాల్గొన్నారు.