13-04-2025 01:53:17 AM
ముఖ్యఅతిథిగా హాజరైన అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): గండిపేటలోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)లో, హైదరాబాద్‌కు చెందిన ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ సహకారంతో మొదటి ప్రయత్నంలో యూపీఎస్సీ సాధించడం ఎ లా? అనే అంశంపై అవగాహన సదస్సు ని ర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పీ కృష్ణప్రదీప్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యూపీఎస్సీ సాధించేందుకు సమయ పాలన, క్రమశిక్షణ, సాధన అవసరమన్నారు.
జనరల్ స్టడీస్ , సమకాలీన అంశాలపై పట్టు ఉండాలన్నారు.అకాడమీ చీఫ్ మెంటర్ డాక్టర్ భవానీ శంకర్ మాట్లాడుతూ కేపీ’స్ అకాడమీకి యూపీఎస్సీ పరీక్షలపై ఉన్న అనుభవాన్ని, ప్రిపరేషన్ టిప్స్ వివరించారు. ఈ సందర్భంగా యూపీఎస్సీకి అవసరమైన ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను విడుదల చేసి సీబీఐటీ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచా రు. సీబీఐటీ పీఆర్‌వో డాక్టర్ జీఎన్‌ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవాలన్నారు.