calender_icon.png 5 February, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్స్‌లో క్యాన్సర్ నివారణపై అవగాహన ర్యాలీ

05-02-2025 02:18:03 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ‘ప్రపంచ క్యాన్సర్ నివారణ’ దినోత్సవం పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం వైద్యులు, వైద్య విద్యార్థులు, పారామెడికల్ విద్యార్థులు, నర్సింగ్, రోగుల బంధువులతో ఎమర్జెన్సీ బ్లాక్ నుంచి పంజాగుట్ట గేట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ బీరప్ప మాట్లాడుతూ వయసుతో సంబంధం (ఆడ, మగ) లేకుండా అందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, ప్రోత్సాహం, ధైర్యం కల్పించడం ద్వారా కేన్సర్ ను జయించవచ్చన్నారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే 100 శాతం నివారించ వచ్చని తెలిపారు.

కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్, లెర్నింగ్ సెంటర్ డాక్టర్ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డాక్టర్ శాంతివీర్ తదితరులు పాల్గొన్నారు. అంతకముందు నగర సీపీ సీవీ ఆనంద్ నిమ్స్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.