calender_icon.png 30 March, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాలపై నెన్నెలలో అవగాహన ర్యాలీ

27-03-2025 12:47:40 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గం(Bellampalli constituency)లో నిత్య కృత్యంగా మారుతున్న నకిలీ పత్తి విత్తనాల(Fake cotton seeds) వ్యవహారంపై పోలీసులు స్పందించారు. నకిలీ విత్తనాల వాడకం వల్ల జరిగే అనర్ధాలపై గురువారం నెన్నెల మండల కేంద్రంలో రైతులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయ , పోలీసు సంయుక్తంగా నిర్వహించిన ఈ ర్యాలీలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలొద్దీన్(Bellampalli Rural CI Syed Afzaluddin) మాట్లాడుతూ రైతుల అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది నకిలీ పత్తి విత్తనాల దందాకు తెరలేపుతున్నారని తెలిపారు. వ్యవసాయ అధికారులు సూచించిన పత్తి విత్తనాలను మాత్రమే వినియోగించాలని రైతులకు సూచించారు. ఎక్కడైనా నకిలీ పత్తి విత్తనాలు అమ్మినట్లు తెలిసిన పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. దళారుల మాటలు నమ్మి నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మెన హరీష్ గౌడ్,ఎస్సై ప్రసాద్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.