calender_icon.png 23 April, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ కల్లు అనర్థాలపై చైతన్యం

18-04-2025 12:00:00 AM

  1. కల్తీ కల్లు అమ్మకాలపై ఉక్కు పాదం

జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలపై వివరించాలని నిర్ణయం

ప్రతి గ్రామంలో కల్తీ కల్లు వల్ల జరిగే అనర్థాల పై అవగాహన సదస్సులు

ఎక్సైజ్, పోలీస్, వైద్యులు, రెవెన్యూ, అధికారులతో గ్రామాలలో సదస్సులు

కల్తీ కల్లు సేవిస్తే అనారోగ్య  పరిస్థితుల ప్రభావం పై అవగాహన

జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ నెంబర్1096 జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, ఏప్రిల్ 17 (విజయక్రాంతి), కల్తీ కల్లు కు జిల్లాలో అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘవన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఎక్సైజ్ అధికారులు పోలీసులు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లాలోని గీత కార్మికులు కల్లు మూస్తే దారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన కల్తీకల్లు సేవిస్తే జరిగే అనార్థాలపై పోస్టర్లను ఆవిష్కరించి వినియోదారులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్ట నున్నారు.

కలెక్టరేట్లో 1069 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. కల్తీకల్లు విక్రయిస్తే టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ అసిస్ సంఘం సూచించారు. ఇటీవల కల్తీకల్లు సేవించి కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి, అంకోల్ మరి కొన్ని గ్రామాలలో కల్తీకల్లు సేవించి అస్వస్థతకు గురైన విషయం విధితమే. గాంధారి మండలం గౌరారం లో మరుసటి రోజు 30 మంది వరకు కల్తీకల్లు సేవించి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

ఎక్సైజ్ అధికారులు ఆ దుకాణాల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్ట్ కు పంపిస్తే అధికంగా ఆల్ఫా జోలం కల్పినట్లు రిపోర్టులో తేలింది. కల్తీ కల్లు విక్రయించిన నలుగురిని అరెస్టు చేయగా 38 మందిపై కేసులు నమోదు చేశారు. 186 కల్లు దుకాణాల్లో జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 163 కల్లు దుకాణాల్లో శాంపిల్స్ సేకరించి రసాయనిక పరీక్ష లకు పంపించారు.

జిల్లావ్యాప్తంగా టిఎఫ్టి లైసెన్సులు పొంది కల్లు మూస్తే దారులకు కల్లు విక్రయాలు చేపడుతూ కృత్రిమ కల్తీ కల్లును తయారుచేసి కల్లు దుకాణాల్లో విక్రయిస్తుండడంతో ప్రజల ప్రాణాలు కల్తీకల్లుకు అడాప్ట్ ఐ కల్లు సేవించకుంటే మానసికంగా పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ విషయాలపై కల్తీ కల్లు విక్రయించకుండా అరికట్టాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో నుంచి ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఉద్దేశంతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎక్సైజ్ అధికారులు ముస్తేదారులతో కలిసి చర్చించారు.

కల్తీ కల్లు లో ఆల్ఫో జో లం కలిపి  పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రాణాల మీదికి వస్తున్న కల్తీ కల్లు ను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కల్తీకల్లుకు బానిసలు కాకుండా తమ కుటుంబ ప్రయోజనాలతో పాటు తమ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

అవగాహన బృందాల ఏర్పాటు

ఈనెల 19న శనివారం రోజున ఉదయం రెండు గ్రామాలు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటలు వరకు గ్రామాలు సాయంత్రము రెండు గ్రామాలు సందర్శించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పౌర సంఘాలు స్వచ్ఛంద సంస్థలు లోకల్ పోలీస్ సిబ్బంది స్వయం సహాయక సంఘాలు గ్రామ సమాఖ్య మండల సమైక్యల ను పాల్గొనేలా అవగాహన బృందాలు ప్రేరేపించాలని సూచించారు.

మన బృందాలు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మద్యపాన నిర్మూలన శాఖ సిబ్బంది గ్రామ కార్యదర్శి తదితరులు అవగాహన బృందంలో పాల్గొనాలి.

ఎక్సైజ్ అధికారుల ఆదేశాలను బెకతార్ చేస్తే డ్రగ్స్ యాక్ట్ అమలు

కల్తీ కల్లు అమ్మకాలు చేపట్టవద్దని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలను బెకతార్ చేస్తే నేషనల్ డ్రగ్స్ యా క్ట్ కింద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎక్సైజ్ అధికారులు కళ్ళు మూస్తే దారులకు క ల్లు గీత కార్మికులకు అవగాహన సదస్సులో హెచ్చరించారు. క ల్లు మూస్తే దారులు ఎక్సైజ్ అధికారుల ఆదేశాలు ఏ మేరకు పాటిస్తారో వేచి చూడాల్సిందే. కల్తీ కల్లు విక్రయాలపై ఉక్కు పాదం మోపేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని సదుఉద్దేశంతో ఎక్సైజ్ అధికారులు పగడ్బందీ వ్యూహాలను పాటించడమే కాకుండా జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ నెంబర్ 1069 నీ ఏర్పాటు చేసి ఫిర్యాదులు చేయాలని నిక్కచ్చిగా వ్యవహరిస్తామని ఎక్సైజ్ అధికారులు కల్లుగీత కార్మికులను ముస్తేదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కరాకండిగా చెప్పారు. కల్తీ కల్లు విక్రయాలపై ఉక్కు పాదం మోపుతామని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు.

ప్రభుత్వం సీరియస్ గా ఉందని తమకు సహకరించాలని గీతా కార్మికులను కల్లు మూస్తే దారులను కోరారు. ఏ మేరకు కల్తీ కల్లును అరికడ్తారో వేచి చూడాల్సిందే.  వినియోగదారులకు చైతన్య తీసుకొనే వినియోగదారుల ఆరోగ్యంపై దాని ప్ర భావం గురించి అవగాహన కార్యక్రమం..జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* ఇటీవల కామారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటనలకు సంబంధించి, కల్తీ కల్లు మరియు కల్తీ కల్లు ని తీసుకునే వ్యక్తుల జీవితంపై దాని హానికరమైన ప్రభావాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇటీవల 07-04-2025 మరియు 08-04-2025 తేదీలలో బిర్కూర్ మరియు నాశ్రుల్లల్లాబాద్ మండలంలోని దుర్కి, దామరాంచ, అంకోల్, రాంపూర్ మరియు సంగ్యం గ్రామాలలో మరియు కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో సంఘటనలు జరిగాయి, కల్తీ కల్లును సేవించడం వలన, పైన పేర్కొన్న ప్రాంతంలోని [83] కంటే ఎక్కువ మంది బాధితులు బాన్స్వాడ, కామారెడ్డి మరియు నిజామాబాద్ ఆసుపత్రులలో చేరారని తెలిపారు.

ఈ విషయంలో నేరస్థులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడ్డాయి. క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాదు ఈ సమస్యకు పరిష్కారం కొరకు  ఈ రకమైన వ్యసనం నుండి బయటపడటానికి ఆ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం కూడా ఖచ్చితంగా అవసరమని అభిప్రాయపడ్డారు. అవగాహన కార్యక్రమాలు కల్తీని కల్లుపై చేయడమే కాకుండా, మాదకద్రవ్య వ్యసనం మరియు దాని హానికరమైన ప్రభావాల గురించి కూడా అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.

కార్య ప్రణాళిక  వివరాలు..

1)అవగాహన బృందాలు 19.4.2025 శనివారం రోజున ఉదయం రెండు (2) గ్రామాలు, (ఉదయం 8:00 నుండి 11:30 వరకు) గ్రామాలు సాయంత్రం రెండు (2) గ్రామాలను సందర్శించాలి, (మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:00 వరకు).

2) ఈ అవగాహన కార్యక్రమాలలో పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశ వర్కర్స్, లోకల్ పోలీస్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు/ గ్రామ సమైక్య మరియు మండల సమైక్యలను పాల్గొనేలా అవగాహన బృందాలు ప్రేరేపించాలి.

3)అవగాహన బృందాలు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుడు, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, మద్యపాన నిర్మూలన శాఖ, సిబ్బంది మరియు గ్రామ కార్యదర్శి మొదలైన వారిని పాల్గొనేలా చేయాలి...

4)గ్రామంలోని రెండు నుండి మూడు ప్రముఖ ప్రదేశాలలో అవగాహన పోస్టర్లను అతికించాలి.

5)ఆ బృందానికి వీడియో ప్రచారం మరియు ప్రెస్ కవరేజ్ అందించాలని నిర్ధారించుకోవాలి

6)బృందాలు ముక్యంగా సంఘ విద్యార్థులు మరియు స్థానిక సంఘాలతో ర్యాలీలు నిర్వహించాలి. టోల్ ఫ్రీ నం. 1908 కి కాల్ చేసి తెలియజేయాలి