calender_icon.png 12 February, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా అరికట్టడంపై అవగాహన

11-02-2025 08:15:11 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు కోర్ట్ ఏరియాలో గల ఎస్టీ గిరిజన వసతి గృహంలో న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కీర్తిచేంద్రిక రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ... మత్తు పదార్థాల వినియోగం వాటి వలన కలిగే దుష్ఫలితాలు, అక్రమ రవాణా అరికట్టడంపై చిన్న వయస్సు నుంచి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మత్తు పదార్థాలు వినియోగం వల్ల ఏర్పడుతున్న దుష్ఫలితాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా అక్రమ రవాణా విద్యార్థులు తెలిసిన వ్యక్తుల ద్వారా గాని, తెలియని వ్యక్తుల ద్వారా గాని వారికి తెలియకుండానే అక్రమ రవాణాకు బాధ్యులు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. 

అందుకే విద్యార్థినులు మీకు తెలియకుండా అపరిచిత వ్యక్తులు ఇచ్చే వస్తువులని, పదార్ధాలను అందులో ఏమి వస్తువులు ఉన్నాయి అని తెలుసుకొని ఇవ్వడం వల్ల మత్తు పదార్థాల బారిన పడకుండా ఉంటారని బారిన పడకుండా చూసుకునే బాధ్యత మీదే అని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం వసతి గృహ వంటశాలను పరిశీలించినారు. ఈ కార్యక్రమంలో జడ్జితో పాటు ఇల్లెందు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. ఉమా మహేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ కీర్తి కార్తిక్, న్యాయవాది మోదుగు వీరేంద్రబాబు, వార్డెన్ భరత్,  బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.