13-03-2025 05:52:30 PM
కాటారం,(విజయక్రాంతి): భూముల క్రమబద్దీకరణ, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిషత్ కార్యాలయం సమావేశం మందిరంలో గురువారం మండల పంచాయతీ అధికారి పి. వీరస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సునీల్, పంచాయతీ కార్యదర్శి షఘీర్ ఖాన్, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎల్ఆర్ఎస్ పనులు నిర్వహిస్తామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు.