calender_icon.png 14 March, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధులపై అవగాహన

13-03-2025 02:06:54 AM

హైదారబాద్, మార్చి 12 (విజయక్రాంతి): క్రానిక్ కిడ్నీ వ్యాధులు (సీకేడీ) హైదరాబాద్ నగరంలో ప్రధాన ఆరోగ్య సమస్యగా మారాయని స్టార్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. బుధవారం హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నెఫ్రాలజీ, అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ గంధే శ్రీధర్ మాట్లాడుతూ.. ఇటీవల సీకేడీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, చిన్నవయసులోనే తీవ్రమైన కిడ్నీ వ్యాధులు వస్తున్నాయన్నారు.

ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రజల్లో అవగాహన అవసరమన్నారు. స్టార్ హాస్పిటల్స్ యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ గుంటపల్లి చిన్న మాలకొండయ్య మాట్లాడుతూ.. స్టార్ హాస్పిటల్‌లో ప్రపంచస్థాయి చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డాక్టర్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రరాజధానిలో ఏటా 1200 సీకేడీ కేసులు నమో  ఈ సంఖ్యలో 2025లో 1400 గా ఉండే ప్రమాదం ఉందని స్టార్ హాస్పిటల్స్ సీనియర్స్ కన్సల్టెంట్లు హెచ్చరించారు. మెరుగైన వైద్యం కోసం తమ ఆస్పత్రిలో సంప్రదించాలని కోరారు.