calender_icon.png 23 November, 2024 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశ్రమ పాఠశాలలో మారకద్రవ్యాలపై అవగాహన

23-11-2024 05:43:32 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఏ హెచ్ ఎస్ బొజ్జాయిగూడెం పాఠశాలలో ఇల్లందు డిఎస్పి చంద్రభాను, సీఐ బత్తుల సత్యనారాయణ సూచన మేరకు ప్రధానోపాధ్యాయురాలు ధనసరి నాగమణి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారు మారకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పి.లక్ష్మారెడ్డి హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి నడవడికతో నడుచుకోవాలని అదేవిధంగా మారకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దనసరి నాగమణి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ వారు విద్యార్థులకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి విద్యార్థులకు మంచి అవగాహన కల్పించిన పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ శాఖ వారు సూచించిన విషయాలను పాటిస్తూ చెడు అలవాటులకు దూరంగా ఉండాలని తెలిపారు. విద్యార్థి దశ నుంచే సమాజంలో మంచి పేరు తెచ్చుకొని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.