calender_icon.png 27 November, 2024 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైంగిక వేధింపులను తప్పించుకోవడంపై అవగాహన

26-11-2024 10:22:42 PM

కోదాడ (విజయక్రాంతి): పట్టణంలో ఆజాద్ నగర్ సహా పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి, నాలుగు ఐదు తరగతుల బాలికలకు 200 మందికి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ బాల సురక్ష వాలంటీర్ ఇంపాక్ట్ ట్రైనర్ వీరవిల్లి  శ్రీలత బాలికలకు సేఫ్ టచ్ అండ్ అన్ సేఫ్ టచ్ గురించి వివరించడం జరిగింది. సమాజంలో బాలికల పట్ల ఎన్నో రకాల ఇబ్బందులకి గురి అవుతున్నారు. పిల్లలు శారీరకంగా మానసికంగా ఉండటానికి చైల్డ్ సేఫ్ కు సంబంధించిన కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాము చాలా మంది పిల్లలు తెలిసి తెలియని వయసులో సర్వే ప్రకారం 50 శాతం మంది పిల్లలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. అలాంటి ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంపాక్ట్ క్లబ్ సభ్యురాలు ఎం.సుభాషిని, హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు బి.సుశీల బాయ్, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పి.వరమ్మ పాల్గొన్నారు.