calender_icon.png 26 March, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన

25-03-2025 08:20:37 PM

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డిలో నాలుగో రోజు ఎన్ఎస్ఎస్ ఒకటి, రెండు, మూడు యూనిట్ల ఆధ్వర్యంలో బొటానికల్ గార్డెన్ ను మంగళవారం శుభ్రపరిచారు. ఈ సందర్భంగా లింక్ వర్కర్ స్కీం ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల విభాగం తరఫున హాజరైన జిల్లా రిసోర్స్ పర్సన్ జి సుధాకర్ వాలంటీర్లకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఎయిడ్స్ తగ్గింది, అంతేగాని పూర్తిగా నిర్మూలించబడలేదని అన్నారు.

నిర్మూలించుటకు వాలంటీర్లు అందరూ తమ వంతుగా వారి వారి గ్రామాల్లో ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ చైర్మన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే కిష్టయ్య, ఐక్యూఏసి కోఆర్డినేటర్ అంకం జయప్రకాష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ పి రాజ గంభీర్ రావు, డాక్టర్ జి చంద్రశేఖర్ గౌడ్, డాక్టర్ బి శారద, వాలంటీర్లు పాల్గొన్నారు.