calender_icon.png 20 April, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల హక్కులపె అవగాహన అవసరం

27-03-2025 12:00:00 AM

  • స్మార్ట్ ఫోన్ వాడకంతో మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయి
  • జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి

మంచిర్యాల, మార్చి 26 (విజయక్రాం తి): మహిళలు వారికి ఉన్న హక్కుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ‘భేటి బచావో- భేటి పడా వో’, జిల్లా మహిళా సాధికారత కేంద్రం, జిల్లా మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి మెంటల్ హెల్త్ అండ్ లీగల్ రైట్స్ అవగాహన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఉప వైద్యాధికారి డాక్టర్ అనితలతో కలిసి మాట్లాడారు.

నేటి సమాజంలో మహిళలు తమకు ఉన్న హక్కుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, స్మార్ట్ ఫోన్ వాడకం పెరగడం వలన మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని, ఎక్కువ సమయాన్ని వృథా చేస్తూ సమస్య ఎదురైనప్పుడు ఎవరికి చెప్పుకోకుండా మానసిక ఒత్తిడి గురవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చాలా మంది జీవితాలు కోల్పోతున్నారని అన్నారు.

స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని, యోగ, వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవాలని తెలిపారు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ 14416ను సంప్రదించాలని సూచించారు.

పని ప్రదేశాలలో మహిళలు ఎదు ర్కొంటున్న సమస్యల గురించి ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలు, లోకల్ కంప్లయింట్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఫిర్యాదు చేయాలని తెలిపారు. మహిళా ఉద్యోగులు భద్రత కలిగిన వాతావరణంలో పని చేసే విధంగా చట్టాలు తోడ్పడతాయని తెలిపారు. 

జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ మహిళల కోసం మానసిక సమస్య లు, న్యాయ హక్కులకు సంబంధించి మెంట ల్ హెల్త్ అండ్ లీగల్ రైట్స్ వంటి కార్యక్రమం నిర్వహించడం మంచి విషయమని అన్నారు.

సురక్షితమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల న్నారు. మార్పు ప్రతి ఒక్కరి నుంచి మొదలవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాన సిక వైద్య నిపుణులు డాక్టర్ సునీల్, పి.ఓ. ఎన్.సి.డి. డాక్టర్ ప్రసాద్, మోటివేషనల్ స్పీకర్ మధుకర్, ఐ.సి.డి.ఎస్. సి.డి.పి.ఓ.లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.