calender_icon.png 31 January, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల స్థాయి నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించాలి

31-01-2025 12:00:00 AM

కలెక్టర్ పమేలా సత్పతి

తిమ్మాపూర్, జనవరి 30: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధ నలపై అవగాహన పెంపొందించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా గురు వారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండ ల కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చొక్కారా వు పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్కును పరిశీలించారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించే ందుకు విద్యార్థులకు అనుభవ పూర్వక శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్, ఫుట్ పాత్ లు, స్పీడ్ బ్రేకర్స్, నో ఎంట్రీ, వన్ వే నీ గురించి వివరించే చిత్రాలు ఏర్పాటు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులను బ్యాచ్‌ల వారీగా ఈ పార్కు కు తీసుకొచ్చి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని అధికారులకు  సూచించారు.

ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నా రు.  కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడలేని విధంగా తిమ్మాపూర్ రవాణా శాఖ కార్యాల యంలో చిల్డ్రన్ పార్కు అందంగా ఉందని దానిని విద్యార్థులు సద్వినియోగం చేసుకునే లా చర్యలు చేపట్టాలని తెలిపారు. దీంతో రోడ్డుపై ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో విద్యార్థులకు పూర్తిగా అవగాహన కలుగు తుందన్నారు.

ఈ పార్కులో మరిన్ని సౌకర్యా లు కల్పించి అధునాతనంగా తీర్చిదిద్దుతా మని చెప్పారు.  ట్రాఫిక్ అవగాహన పార్కు లో తెలుసుకున్న విషయాలను ఆచరించా లన్నారు. హెల్మెట్, సీటు బెల్ట్ ప్రాధాన్యతను ఇళ్లకు వెళ్లి తమ తల్లిదండ్రులకు వివరించాల న్నారు. ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా మండలా ల్లోని ప్రతి పాఠశాల విద్యార్థులను ఇక్కడకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని డీఈఓకు సూచించారు. 

అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం అన్ని పాఠశాలల విద్యార్థులను ఇక్కడకు తీసుకొస్తే ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత విషయా లు తెలుస్తాయని పేర్కొన్నారు. పాఠశాల నుంచి బస్సులో తీసుకొచ్చి మళ్లీ బస్సులో నే వారి పాఠశాల వద్ద దించాలని సంబం ధిత అధికారులకు సూచించారు. 

ఈ కార్యక్రమంలో డీటీసీ పురుషోత్తం, డీటీఓ చక్రవర్తి శ్రీకాంత్ చక్రవర్తి, డీఈఓ జనార్దన్ రావు, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ అశోక్, తాసిల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంఈఓ శ్రీనివాస్, ఎంవీఐ రవికుమార్, ఏఎంవిఐలు స్రవంతి, హరిత యాదవ్,పాల్గొన్నారు.