calender_icon.png 23 February, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

22-02-2025 11:19:33 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో వ్యాపారస్తులు సహకరించాలని, తమ వద్దకు వచ్చే కస్టమర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని ట్రాఫిక్ అడిషనల్ సీపీ పి. విశ్వ ప్రసాద్(Traffic Additional CP P. Vishwaprasad) కోరారు. వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు చట్టపరమైన నిబంధనలు పాటించాలని సూచించారు. బ్లాక్ ఫిల్మ్‌లు, సైరన్‌లు, మ్యూజికల్ మల్టీ టోన్ హారన్‌లు, మోడిఫైడ్ సైలెన్సర్‌లు, నంబర్ ప్లేట్లు, వాహనాల మార్పులు తదితర అంశాలకు సంబంధించి వ్యాపారులకు ట్రాఫిక్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ పాత సీపీ కార్యాలయంలో శనివారం అవగా హన కార్యక్రమం జరిగింది. సమావేశంలో ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ వ్యాపారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే వచ్చే ఇబ్బందులను వివరించారు. వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించినట్లు అయితే చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రేటర్‌లో రహదారి భద్రతను మరింత మెరుగుపర్చేదుకు సహకరించాలని అన్నారు.