calender_icon.png 4 October, 2024 | 5:03 PM

పొగాకు వాడకం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన

04-10-2024 02:55:31 PM

 జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి శ్రీకాంత్

ఆదిలాబాద్ (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరూ పొగాకు వాడకం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సైకాలజిస్ట్ శ్రీకాంత్ అన్నారు. నేషనల్ టొబాకో ఫ్రీ యూత్ 2.0 క్యాంపెన్ లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని పూత్లిబౌలి పట్టణ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగతాగడం, గుట్కా, తంబాకూ వాడకం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు.

క్యాన్సర్, గుండెపోటు, గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఎముకల క్యాన్సర్ తదితర తీవ్రమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని హెచ్చరించారు. కనుక పొగాకు ఉత్పత్తుల వాడకం తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమ సమన్వయ కర్తలు వెంకటరమణ, శ్రీనివాస్, సోషల్ వర్కర్ చిరంజీవి, ఆసుపత్రి సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.