28-03-2025 09:13:49 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో శుక్రవారం నాడు ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు వేసవి సెలవుల్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కళాబృందంతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, అందులో భాగంగా విద్యార్థులకు వేసవి సెలవుల్లో అపరిచిత వ్యక్తులతో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, గ్రామాలలో విద్యార్థులు చెరువుల వద్ద ఈతకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని,సోషల్ మీడియాలో వచ్చే లింకుల పట్ల జాగ్రత్త వహించాలని,సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930కు కాల్ చేయాలని,ఇతర అత్యవసర సమయాల్లో 100 నెంబర్ కు డయల్ చేసి సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రమీల, కళాబృందం సభ్యులు, షీ టీం సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.